![]() |
![]() |
.webp)
ప్రతీ సంక్రాంతికి చాలామంది ఇంటికి వెళ్ళి అమ్మ చేసిన పిండివంటలు తిని మళ్ళీ సిటీకి వచ్చేసి తమ పనుల్లో బిజీగా ఉంటారు. అయితే ఇలా ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పండుగని గొప్పగా జరుపుకుంటారు. అయితే కొందరు సెలెబ్రిటీలు సిటీలోనే ఉండి వారి కంఫర్ట్ లో వాళ్ళు జరుపుకుంటున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తమ సొంతూరికి పోకుండా ఇక్కడే పండుగని సెలబ్రేట్ చేసుకునేవారు చాలామందే ఉన్నారు. వారిలో శోభాశెట్టి ఉంది. ఎప్పుడు ఫ్రెష్ కంటెంట్ తో ముందుకు వస్తూ ఫ్యాన్ బేస్ ని మరింత పెంచుకుంటుంది ఈ భామ.
బిగ్ బాస్ సీజన్-7 లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో మొదట రైతు బిడ్డ ప్రశాంత్ ఉంటే ఆ తర్వాత కార్తీక దీపం మోనిత అలియాస్ శోభాశెట్టి ఉందనే చెప్పాలి. హౌస్ లోకి వెళ్ళినప్పుడు మొదట్లో చాలా సాధారణంగా కనిపించిన శోభాశెట్టి.. మెల్లి మెల్లిగా చంద్రముఖిలా మారిపోయిందంటూ ప్రతీవారం ఫుల్ ట్రోల్స్ వచ్చేవి. వాటిని వీకెండ్ మీమ్స్ అండ్ ట్రోల్స్ లో హోస్ట్ నాగార్జున బిగ్ స్క్రీన్ మీద వేసి చూపించాడు. బిగ్ బాస్ హౌస్ లో శోభాశెట్టి ఆటతీరు, మాటతీరుకి ప్రేక్షకులు తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు ప్రియాంక, అమర్ దీప్ లతో కలిసి గ్రూప్ గా ఉంటు టాస్క్ లలో కూడా గ్రూప్ గా ఆడుతూ, నామినేషన్ టైమ్ లో అందరు కలిసి ఎవరెవరిని నామినేషన్ చేయాలని మాట్లాడుకోవడం అన్నీ కూడా తనకి మరింత నెగెటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చాయి. అయితే ఆటలో ఉన్నప్పుడు ఫౌల్ చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు కానీ మరీ సంఛాలక్ గా ఉండి కూడా ప్రియాంక, అమర్ దీప్ లకి సపోర్ట్ చేసేది. ఇక మొదటి వారం నుండి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి శోభాశెట్టి, అమర్ దీప్, ప్రియాంక కలిసి చేసిన నామినేషన్ లు చాలానే ఉన్నాయి.
శోభాశెట్టి హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ముద్దుబిడ్డ అనేవాళ్ళు ఎందుకంటే తనెంత చెత్త ఫర్ఫామెన్స్ ఇచ్చిన, ఓటింగ్ లో ఎంత లీస్ట్ లో ఉన్న తను మాత్రం ప్రతీవారం సేఫ్ అయ్యేది. బిగ్ బాస్ నుండి ఎలిమినేషన్ అయి బయటకొచ్చాక యూట్యూబ్ లో సొంతంగా వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఇన్ స్ట్రాగ్రామ్ లో ఫోటోషూట్స్, రీల్స్ తో బిజీగా ఉంటున్న ఈ భామ.. తాజాగా "నాకు కాబోయే వారితో నా మొదటి సంక్రాంతి" అనే వీడియోని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. ఇందులో తనకు కాబోయే భర్త యశ్వంత్ అని చెప్తూ.. అతనితో కలిసి పూజ చేసింది. కన్నడవారికి ఇష్టమైన బొప్పట్లని ఇంట్లో చేసింది శోభాశెట్టి. ఇక ఇంటిని అందంగా అలంకరించి.. యశ్వంత్ దగ్గర తొలిసారి ఆశీర్వాదం కూడా తీసుకుంది. ప్రస్తుతం ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తుంది.
![]() |
![]() |